30 April, 2026 | 12:13 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో ఆరుగురికి జరిమానా

19-11-2025 08:37 PM

సిద్దిపేట క్రైం : మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి న్యాయమూర్తి రూ.అరవై వేల ఐదు వందలు జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని పలు చౌరస్తాలు, రాజీవ్ రహదారిపై సిబ్బందితో  వాహనాలు తనిఖీ చేయగా, ఆరుగురు మద్యం తాగి నడుపుతుండగా పట్టుకున్నట్టు చెప్పారు. వారిని బుధవారం సిద్దిపేట ఒకటవ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఎదుట హాజరుపరచగా, జరిమానా విధించారని తెలిపారు.  

ఒకరికి రెండు రోజుల జైలు

సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేయగా, పుల్లూరి మల్లయ్య అనే వ్యక్తి మద్యం తాగి వాహనము నడుపుతూ పట్టుపడ్డాడని ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. బుధవారం అతడిని న్యాయమూర్తి తరణి ఎదుట హాజరుపరచగా, రెండు రోజుల జైలు శిక్ష విధించారని చెప్పారు.