తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌గా అనిల్
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ మేనేజర్‌గా వై. అనిల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన జె. కృష్ణ నీల్ వై కు బదిలీ కావడంతో, మంచిర్యాల శాఖ నుంచి బదిలీపై వచ్చిన అనిల్ నూతన మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా బ్యాంక్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అనిల్ మాట్లాడుతూ, ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రాధాన్యమని తెలిపారు. రైతులు, స్వయం సహాయక సంఘాలు, యువతకు బ్యాంకు ద్వారా అందుబాటులో ఉన్న రుణాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేకూరేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని నూతన మేనేజర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.






