15 July, 2026 | 12:00 AM

జోరుగా సాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ

15-07-2026 12:00 AM

జూబ్లీహిల్స్, జూలై 14 (విజయక్రాంతి): ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఫిలింనగర్ లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ జోరందుకుంటుంది. ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీలో బీఆర్‌ఎస్ నేతలు బీఎల్‌ఓలకు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు వెంకీ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఫిలింనగర్లోని మాగంటి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు.

ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా అందజేశారు. వాటిని నింపడంలో వారికి సహకరించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అర్హులైన ఓటరు తమ ఓటు హక్కును విధిగా కాపాడుకోవాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల్లో వివరాలను సక్రమంగా భర్తీ చేయాలని కోరారు. ఏదైనా సందేహం ఉంటే బీఎల్‌ఓలు, బీఎల్‌ఏల సహకారంతో నివృత్తి చేసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ లు రాజు, నాగరాజు, నాయకులు శ్రీనివాస్ నాయుడు, చైతన్య, మహేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.