నల్లపోచమ్మ, కట్టమైసమ్మ ఆలయం వద్ద అన్నదానంలో పాల్గొన్న జంపన ప్రతాప్
15-07-2026 12:00 AM
సికింద్రాబాద్,జూలై 14 (విజయక్రాంతి): అమావాస్య పురష్కరించు కొని ఈ రోజు న్యూ బోయినపల్లి బాపూజీనగర్ లోని శ్రీ దేవి నల్లపోచమ్మ,చిన్నతోకట్ట లోని కట్టమైసమ్మ ఆలయాల కమిటి ఆధ్వర్యంలో జరిగిన పూజ,అన్నదాన కార్యక్రమంలో స్థానికఎమ్మెల్యే, బోర్డు మాజీ ఉపాధ్య క్షులు జంపన ప్రతాప్ హాజరై పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హ్యుమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ బాటియా, సీనియర్ నాయకులుముప్పిడి మధుకర్, ఆలయ కమిటి సభ్యులు ఆజిత్, నర్సింహా, దుర్గయ్య, ప్రేమ్ ముదిరాజ్, నర్సింహా,రామారావు, క్రాంతి,అరుణ్ యాదవ్,విట్టల్ రావు తదితరులు పాల్గొన్నారు.






