31 May, 2026 | 1:35 AM

మను బాకర్, సామ్రాట్‌లకు రజతం

31-05-2026 01:06 AM

మ్యూనిచ్, మే 30 : ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో రజతం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను బాకర్, సామ్రాట్ రాణా జోడీ రెండో స్థానంలో నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో భారత జోడీ 483.6 పాయింట్లు సాధించి రజతాన్ని కైవసం చేసుకుంది.

మను బాకర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 242.1 పాయింట్లు స్కోరు చేయడం ద్వారా అత్యధిక వ్యక్తిగత పాయింట్లు సాధించిన షూటర్‌గా రికార్డులకెక్కింది. ఈ ఈవెంట్‌లో చైనాకు చెందిన యో,హు కుయ్ స్వర్ణం గెలుచుకున్నారు. ఈ చైనా జంట 483.9 పాయింట్లు స్కోరు చేసింది. కాంస్య పతకం కూడా చైనాకే దక్కింది. షెన్ ఇయాయో, షుహాంగ్ జంట 418 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.