నేడు వడగాల్పులు!
- మంచిర్యాలలో 45.4 డిగ్రీలు
- పెద్దపల్లిలో 45.3, వరంగల్‌లో 45.2 డిగ్రీలు నమోదు
- జూన్ 4 తరువాత రాష్ట్రంలో వర్షాలు
హైదరాబాద్/మహబూబాబాద్, మే 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆదివారం ఎండ తీవ్రతతోపాటు వడగాల్పులు కూడా వీస్తా యి. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి భారీ మార్పు ఉండదని, ఆ తర్వాత నాలుగు రోజులలో మాత్రం అవి క్రమంగా 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం మంచిర్యా లలో 45.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమో దు కాగా, పెద్దపల్లిలో 45.3 డిగ్రీలు, ఉమ్మడి వరంగల్‌లో 45.2 డిగ్రీలు, నిర్మల్‌లో 45.2 డిగ్రీలు, కొమురంభీం ఆసిఫాబాద్‌లో 45.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక మిగతా జిల్లాల్లో 39.1 డిగ్రీల నుంచి 44.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 25.0 డిగ్రీలు నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాను శనివారం భానుడు భగభగలాడించాడు. ఎండ తీవ్రతకు తోడు వడగాడ్పుల వల్ల జనసంచారం లేక ప్రధాన నగరాల్లోని రోడ్లు నిర్మా నుష్యంగా మారాయి. మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
భూపాలపల్లిలో 44.7, హనుమకొండలో 44.5, జనగామలో 43.4 పగటి ఉష్ణోగ్రతలు న మోదయ్యాయి. మరో రెండు రోజులపాటు ఎండ తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదివారం ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూ ర్యాపేట జిల్లాల్లో 41 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముంది. అయితే ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో వడగాల్పులు వీస్తాయి.
అదేవిధంగా నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు గంటకు 40 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇదిలా ఉంటే జూన్ 4 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షా లు కురుస్తాయని సూచించింది.
సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం, మంచి ర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారా యణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయి. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో వర్షాలు కురుస్తాయి. ఇలా జూన్ 4 వరకు పలు జిల్లాల్లో మోస్తా రు వానలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.






