బలైంది బాల్క సుమనే..
- అధికారం కోసం బీఆర్‌ఎస్ ఎంతకైనా తెగిస్తుంది
- ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీ పొలిటికల్ డ్రామాలో బాల్కసుమన్ బలయ్యాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం బీఆర్‌ఎస్ ఎంతకైనా తెగిస్తుందని దుయ్యబట్టా రు. ‘పట్టాలు కోయాలి. దాడులు చేయండనేది బీఆర్‌ఎస్ భాష. ఇది కేసీఆర్ నైజం.. తనకు తెలిసిన రాజకీయాన్నే ఇప్పుడు ఆయన కొడు కు కేటీఆర్‌కు నేర్పుతుండని విమర్శించారు. కేటీఆర్‌కి తెలిసిన నీతిని ఇప్పుడు సుమన్‌కి చెప్పాడు.
తప్పు చేసి దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు’ అని దయాకర్ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగ సంఘాల ను, రైతులను రెచ్చగొడుతున్నారని.. బీఆర్‌ఎస్ బతుకు అంతా రెచ్చగొట్టడమేనన్నారు. బాల్క సుమన్‌తో మాట్లాడించింది ఎవరో పోలీస్ అధికారులు విచారణ చేయాలని కోరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర కేసీఆర్‌దని విమర్శించారు. బీఆర్‌ఎస్ ముసుగులో మిలిటెం ట్లను తయారు చేస్తున్నారని, ఆ పార్టీని నిషేధించాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ కేసీఆర్ ఇంట్లో పాలేరుగా పని చేశాడని, ఇప్పు డు పాలేరును ముందు పెట్టి రాజకీయం చేయాలని కేసీఆర్, కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.






