మన హమాలీలు ఎక్కడ?
పరాయి భుజాలపై తెలంగాణ ధాన్యం
ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలింపు
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): దేశంలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేస్తు న్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది. కోట్లాది టన్నుల ధాన్యం, వేలాది కొనుగోలు కేంద్రాలు, వందల రైస్ మిల్లులు, భారీగా ఎఫ్‌సీఐ నిల్వలతో రాష్ట్ర వ్యవసాయ వ్యవస్థ వేగంగా విస్తరించింది. అయితే వరి, మొక్కజొన్న వంటి ధాన్యం దిగుబడి పెరిగిన స్థాయిలో కొనుగోలు మాత్రం ముందుకు సాగడం లేదు. దీనికి ప్రధాన కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత.

ప్రస్తుతం తెలంగాణలోని కొనుగోలు వ్యవస్థ భారా న్ని వలస కార్మికులే ఎక్కువగా మోస్తున్నా రు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రా ల నుంచి వచ్చే వలస హమాలీలే ఇప్పుడు తెలంగాణ ధాన్యం సేకరణకు అసలైన వెన్నెముకగా మారిపోయారు.
2020 కరోనా లాక్‌డౌన్ సమయంలో ధాన్యం కొనుగోలు పనులు పూర్తిచేయడానికి ప్రభుత్వం, రైస్ మిల్లర్లు దాదాపు 20 వేల మంది బీహార్ హమాలీల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
అయితే ఆరేళ్లు గడిచినా పరిస్థితి మాత్రం మారలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో వరి సాగు భారీగా పెరిగింది. ప్రస్తు తం రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా తద్వారా 1.5 కోట్ల మెట్రిక్ టన్నులకు ధాన్యం పైగా దిగుబడి వచ్చింది. ఈ స్థాయిలో ఉత్పత్తిని తక్కువ సమయంలో తరలించడానికి వేలాది మంది హమాలీలు అవసరం అవుతున్నా రు.
కానీ స్థానికంగా ఆ స్థాయిలో కార్మిక శక్తి అందుబాటులో లేకపోవడంతో ప్రభు త్వం, రైస్ మిల్లర్లు వలస హమాలీలపై ఆధారపడుతున్నారు. అయితే ఈ ఏడాది కూడా ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి ప్రధాన కారణం కార్మికుల కొరతేనని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.
పశ్చిమ బెంగాల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా అక్కడి కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో కొనుగోలు వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడింది. దీంతో ధాన్యం సేకరణలో జాప్యంకావడం, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో ఆరుగాలం శ్రమించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
తెలంగాణలో హమాలీల పరిస్థితి..
తెలంగాణ వ్యవసాయ, ధాన్యం కొనుగో లు వ్యవస్థను నడిపిస్తున్న హమాలీల అస లు సంఖ్యపై ఇప్పటికీ ప్రభుత్వానికి ఖచ్చితమైన డేటా లేదు. అధికారిక లేబర్ రిజిస్ట్రీ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న హమాలీల సంఖ్య అంచనాలకే పరిమితమైంది. అయితే రైస్ మిల్లర్స్ అసోసియేష న్లు, మార్కెట్ యార్డు వర్గాలు, కార్మిక సం ఘాల సమాచారం ఆధారంగా చూస్తే తెలంగాణలో లక్షలాది మంది హమాలీలు పనిచే స్తున్నట్లు తెలుస్తోంది.
కార్మిక సంఘాలు, పౌరసంఘాల అంచనాల ప్రకారం తెలంగాణలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న హమాలీ లు, మాన్యువల్ లోడింగ్ కార్మికులు కలిపి సుమారు 8 లక్షలకు పైగా హమాలీలు ఉ న్నారని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయ సీజన్ సమయంలో పని చేస్తున్న వలస హమాలీల సంఖ్య భారీగా పెరిగిందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్లు చె బుతున్నాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వలస కార్మికులకు సంబంధించిన గణాంకాల ప్రకారం బీహార్‌కు చెందిన వారు 20 వేలకు పైగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు 12 వేల నుంచి 15 వేల వరకు, ఒరిస్సాకు చెందిన వారు సుమారు 10 వేలు, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వారు 7 వేల వరకు, జార్ఖండ్‌కు చెందిన వారు 6 వేల వరకు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు 3 వేల వరకు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 3 వేలకు పైగా హమాలీలతో కలిపి మొత్తం 70 వేల నుంచి లక్ష మంది వరకు హమాలీలు తెలంగాణలో పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ వలస హమాలీలు ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, జగిత్యాల, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పనిచేస్తున్నారని సమాచారం.
వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటుకు డిమాండ్..
తెలంగాణలో హమాలీలకు సంబంధించి ప్రత్యేక డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ లేకపోవడమే ప్రస్తుతం నెలకొన్న కొరతకు ప్రధాన కారణం. చాలా మంది అసంఘటిత రంగం లో పనిచేస్తుండటంతో వారి సంఖ్యపై ఖచ్చితమైన లెక్కలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు మాత్రం వెం టనే హమాలి వెల్ఫేర్ బోర్డు, రాష్ట్రవ్యాప్త కా ర్మిక రిజిస్ట్రేషన్, ఆరోగ్య భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, నివాస కాలనీలు అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
2026 నాటికి తెలంగాణ ముట్టా, జట్టు, హమాల్, ఇతర మాన్యువల్ వర్కర్స్ చట్టం 1976కి 50 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా పూర్తిస్థాయి వెల్ఫేర్ బోర్డు లేకపోవడంపై ఉద్యమకారు లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దేశానికి బియ్యం అందిస్తున్న తెలంగాణ కానీ ఆ బి య్యం బస్తాలను మోయడానికి మాత్రం ఇతర రాష్ట్రాల కార్మికులపైనే ఎందుకు ఆధారపడుతోంది? అని ప్రశ్నిస్తున్నారు.
హమా లీలు ఒక్కరోజు సమ్మె చేసినా ధాన్యం కొనుగోలు నిలిచిపోతుందని, రైస్ మిల్లులు ఆగిపోతాయి, గోదాముల సరుకు రవాణా స్థంభిస్తుంది, ఎఫ్‌సీఐ నిల్వల తరలింపు దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. అందు కే హమాలీలను తెలంగాణ వ్యవసాయరవాణా వ్యవస్థకు అదృశ్య వెన్నెముకగా అభివర్ణిస్తున్నారు.
అక్కడ ఎన్నికలతో ఇక్కడ కొరత..
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి ప్రధాన కారణాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస హమాలీలు ఎన్నికల కోసం స్వరాష్ట్రాలకు వెళ్లిపోవడమేనని పేర్కొన్నారు. వాస్తవా నికి తెలంగాణలోని కొనుగోలు వ్యవస్థ వల స కార్మికులపై ఎక్కువ ఆధారపడటం, వారు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా వెళ్లిపోవడంతో రాష్ట్రంలో రైస్ మిల్లులు, కొనుగో లు కేంద్రాలు, గోదాముల్లో ఒక్కసారిగా కా ర్మికుల కొరత ఏర్పడింది.
ఇది ఒక్కరోజులో ఏర్పడిన పరిస్థితి కాదు. సంవత్సరాలుగా తెలంగాణ ధాన్యం సేకరణ వ్యవస్థ బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వలస హ మాలీలపైనే ఆధారపడుతూ వచ్చింది. ఆ పరిణామం ఎంత ప్రమాదకర స్థాయికి చే రిందో బెంగాల్ ఎన్నికలతో స్పష్టమైంది. రై తుల నుంచి ధాన్యం బస్తాలు దించడం, తూ కం కేంద్రాలకు తరలించడం, ట్రక్కులలో లోడింగ్, రైస్ మిల్లులకు సరఫరా, ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వలు వంటి పనుల్లో హమాలీలు కీలక పాత్ర పోషిస్తారు.
అయితే ఈ ప నుల్లో చిన్న అంతరాయం వచ్చినా మొత్తం కొనుగోలు వ్యవస్థ ప్రభావితమవుతుంది. అ యితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయం లో వేలాది మంది కార్మికులు స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో బస్తా లు పేరుకుపోయాయి. ట్రక్కుల లోడిం గ్ ఆలస్యం కావడంతోపాటు రైస్ మిల్లుల్లో ప్రాసెసింగ్ దెబ్బతింది. దీంతో రైతులు రోజు ల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మరో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఆగిపోవడం సాధారణ విషయం కాదని, ఇది తెలంగాణలో స్థానిక కార్మిక వ్యవస్థ బలహీనపడిందనే సంకేతమ ని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వ్యవసాయ ఉత్పత్తిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ స్థానిక హమాలీలను ప్రోత్సహించకపోవడం, హమాలీ వృత్తిని అసంఘటి తంగానే వదిలేయడం, వెల్ఫేర్ బోర్డు ఏర్పా టు చేయకపోవడం, యువతకు శిక్షణ లేకపోవడం వంటి కారణాలతో ఇప్పుడు పూర్తిగా వలస కార్మికులపై ఆధారపడాల్సి వస్తోందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
స్థానిక హమాలీల్లో తగ్గుతున్న ఆసక్తి..
ప్రస్తుతం రాష్ట్రంలో హమాలీల కొరత ఏర్పడటంతో స్థానిక హమాలీలు ఎందుకు తగ్గిపోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో హమాలీ పని సాధారణ ఉపాధిగా ఉండేది. ఇప్పుడు యువతకు శారీరక శ్రమతో కూడిన పనులపై ఆసక్తి తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. రోజుకు వంద ల బస్తాలు మోయాల్సి ఉంటుంది. ఎండలో, దుమ్ములో, రాత్రివేళల్లో కూడా పని చేయాలి. 12 నుంచి 16 గంటల వరకు శ్రమించాల్సి వస్తుంది. దీంతోపాటు నగరాలకు వలస వెళ్లి పోవడం కూడా కారణంగా చెబుతున్నారు.
గ్రామీణ యువత ఎక్కువగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు, డెలివరీ పనులు, డ్రైవింగ్, గల్ఫ్ వలసలు వైపు ఆసక్తి చూపుతున్నది. దీనికి తోడు బీహార్, ఒడిశా, బెంగాల్ నుంచి కార్మికులు గుంపులుగా రావడం, తక్కు వ ఖర్చుతో జీవించడం, ఎక్కువ గంట లు పనిచేయడం, సీజన్ మొత్తం అందుబాటులో ఉండడం వంటి అంశాలు మి ల్లర్లు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదిలాఉండగా హమాలీ వృత్తి అసంఘటిత రంగానికి చెందడంతో ఇందులో పీఎఫ్, ఈఎస్‌ఐ, ఆరోగ్య భద్రత, ఉద్యోగ హామీ, స్థిరమైన వేతనాలు లేకపోవడంతో స్థానిక యువత దీర్ఘకాల ఉపాధిగా ఈ రంగాన్ని చూడ డం లేదు.
అన్ని పనులకు ఇతర రాష్ట్రాల నుంచే
కొనుగోలు కేంద్రాల్లో పనిచేసేందు కు బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వలస హమాలీలు ఈ ఏడాది 30 శాతం తగ్గా రు. దీంతో హమాలీల కొరత తీవ్రంగా ఏర్పడింది. కోట్లాది జనాభా ఉన్న తెలంగాణలో ఏ పనికైనా ఇతర రాష్ట్రాల నుం చి వస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, స్థానిక హమాలీలు పనిచేయకపోతే భ విష్యత్‌లో తెలంగాణ అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది.
వాస్తవానికి ఇతర రాష్ట్రాల నుంచి భారీగానే హమాలీలు వస్తుండగా అక్కడ కూడా వారికి సరైన ఉపాధి దొరుకుతుండటంతో ఇ క్కడకు రావడానికి మొగ్గు చూపకపోవ డం కూడా ప్రస్తుతం ఏర్పడిన కొరతకు ఒక కారణంగా భావించవచ్చు. అందుకే స్థానికంగా యువతకు అవగాహన క ల్పించాలి. విద్యార్హతను బట్టి ఉపాధిని అందించాలి.
మోహన్‌రెడ్డి, తెలంగాణ
రైస్ మిల్లర్స్ అసోసియేషన్
జనరల్ సెక్రటరీ






