1 August, 2026 | 6:05 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •  

డీఈఈ సెట్ ఫలితాలు విడుదల

31-05-2026 01:32 AM

7918 మంది ఉత్తీర్ణత

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): డీఈఈసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. తెలుగు మీడియం కోర్సుకు 12,373 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 9612 మంది పరీక్షకు హాజరుకాగా, 7918 (82.37 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కోర్సులో తొలి ర్యాంకును బి. ఆనందు సాధించారు. ఇంగ్లీష్ మీడియానికి 18,985 మంది దరఖాస్తు చేసుకోగా, అందు లో 14,414 మంది పరీక్షకు హాజరుకాగా, వీరిలో 12,784 (88.69 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ కోర్సులో ఫస్ట్ ర్యాంకు ను జవ్వాజి శివ నాగేశ్వర్ సాధించారు. ఉర్దూమీడియానికి 1234 మంది దరఖాస్తు చేసుకో గా, 1028 మంది పరీక్ష రాస్తే 435 (42.31 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో దానిష్ అహ్మద్ తొలి ర్యాంకును సాధించారు. జూన్ 2 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని డీఈఈ సెట్ కన్వీనర్ జి.రమేష్ తెలిపారు. వెబ్‌ఆప్షన్ల్ల నమోదు జూ న్ 6 నుంచి 8 వరకు అవకాశం కల్పించారు.