జ్ఞానేశ్వరికి రజతం.. బింద్యారాణికి కాంస్యం
కామన్‌వెల్త్ గేమ్స్ పతకాల వేటలో భారత్ పుంజుకుంటోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో అంచనాలకు తగ్గట్టే మన క్రీడాకారులు రాణిస్తున్నారు. సోమవారం జ్ఞానేశ్వరి రజతం అందుకోగా, బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయి. భారత క్రీడాకారులు మెడల్ ఈవెంట్స్‌కు అర్హత సాధించారు.
- వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ జోరు
- బాక్సింగ్ క్వార్టర్స్‌లో అంకుశ్, సచిన్
- 10,000 మీ. ఫైనల్లో గుల్వీర్ సింగ్
గ్లాస్గో, జూలై 27 : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ వెయిట్‌లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. ఆదివారం మీరాబాయి చాను, రిషికాంత సింగ్ ముత్తు పాండీ పతకాలు సాధించగా, సోమవారం కూడా భార త లిఫ్టర్లు అదరగొట్టారు. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం దక్కించుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి.. క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు ఎత్తి, మొత్తంగా 199 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది.
ఒనో మే ఒమోలోలా (నైజీరియా) స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆమె మొత్తం 206 కిలోల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. కెనడాకు చెందిన రెబెకా గ్రౌలక్స్ కాంస్య పతకం సాధించింది. ఈ ఫైనల్లో జ్ఞానేశ్వరి.. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ రెండింటిలోనూ అన్ని ప్రయత్నాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా లిఫ్ట్ చేసింది. ఛత్తీస్‌ఘడ్ భోండి యా గ్రామానికి చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి యాదవ్ రాష్ట్ర పోలీస్ శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తోంది.
ఆమె తండ్రి ఒకప్పుడు బాడీబిల్డర్. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కలను నెరవేర్చుకోలేకపోయా డు. అలాగే మహిళల 58 కేజీల విభాగంలో బింద్యా రాణి దేవి కాంస్య పతకం సాధించింది. హోరాహో రీగా సాగిన పోటీల్లో ఆమె స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 112 కేజీలు మొత్తంగా 199 కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో రజతం గెలిచిన బింద్యా రాణి దేవి ఒత్తిడిలోనూ రాణించింది. ఈ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఐదో మెడల్.
దీంతో భారత్ ఇప్పటివరకు ఆరు పతకాలు సాధించింది. మరోవైపు భారత బాక్సర్లు తమ పంచ్ పవర్ చూపిస్తున్నారు. మరో ఇద్దరు భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. పురుషుల 80 కిలో ల విభాగంలో అంకుశ్ క్వార్టర్స్ చేరుకున్నాడు.
హర్యానాకు చెందిన అంకుశ్ ధాటికి జలాన్ జాన్(అంటిగ్వా) చేతులెత్తేశాడు. ఆరంభం నుంచి సూపర్ పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. పూర్తి ఆధిపత్యం కనబరి చి5 గెలుపొందాడు. అలాగే 60 కిలో ల విభాగంలో సచిన్ ఇంగ్లండ్ బాక్సర్ విలియం హెవిట్‌ను చిత్తు చేసి క్వార్టర్స్ బెర్తు సాధించాడు. వీరిద్దరూ సెమీఫైనల్ చేరుకుంటే కాంస్యాలు ఖాయమవుతాయి. ఇదిలా ఉంటే భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో 10,000 మీ. ఫైనల్లో అడుగుపెట్టాడు.






