లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఐ
బోధన్ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ
కామారెడ్డి, మే 6 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏసీబీ తనిఖీలు కలకలం సృష్టించాయి. పట్టణ ఎస్‌ఐ భాస్కరాచారి ఓ బాధితుడి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించింది. బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలోని రుద్రూరు, కోటగిరి, ఎడపల్లి, రెంజల్, నవీపేట్, వరిని పోలీస్ స్టేషన్లో పరిధిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఏసీబీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులందాయి.
దీంతో బోధన్ పోలీ స్ స్టేషన్‌పై బుధవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాత కేసు విషయంలో ఎస్‌ఐ భాస్కరచారి ఓ బాధితుడి నుంచి రూ. 10వేలు డిమాండ్ చేయగా రూ. 6 వేలకు ఒప్పందం కుదిరింది. నగదు తీసుకుంటుండగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఐ భాస్కరాచారిని విచారిస్తున్నారు. విచారణ పూర్తి అయిన అనంతరం ఏసీబీ అధికారులు ఎస్‌ఐని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.






