27 June, 2026 | 2:20 PM

Breaking News

రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •  

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

07-05-2026 01:53 AM

కూకట్‌పల్లి, మే 6 (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి  కాలనీ డివిజన్‌లలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. కూకట్‌పల్లి డివిజన్ లోని సాయిబాబానగర్, ఏవీబీ పురంలలో రూ.50 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు,  ప్రశాంత్‌నగర్‌లో రూ. 75 లక్షల వ్యయంతో చేపట్టనున్న కమాన్ సెంటర్ మీడియన్ పనులకు హాజరై శంకుస్థాపన చేశారు.

అనంతరం కే పిహెచ్‌బి డివిజన్ నాలుగో పేజ్‌లో రూ. 16 లక్షల విలువ గల వాటర్ వర్క్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మందాడి శ్రీనివాసరావు, ఆవుల రవీందర్ రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు బొట్టు విష్ణు, సంతోష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.