మైపాల్ రెడ్డికి శ్రామిక శక్తి అవార్డు
గాంధీభవన్లో అందజేసిన టిపిసిసి అధ్యక్షుడు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ గ్రామానికి చెందిన నల్ల మైపాల్ రెడ్డి శుక్రవారం శ్రామిక శక్తి అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా శ్రామిక శక్తి అవార్డును నల్ల మహిపాల్ రెడ్డి అందుకున్నారు. 25 సంవత్సరాల నుండి ఐఎన్టియుసి యూనియన్ తరపున గాయత్రి షుగర్స్ లో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడంతో గుర్తించి మహిపాల్ రెడ్డికి శ్రామిక శక్తి అవార్డు అందించినట్లు ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, జాతీయ ఐఎన్టీయూసీ అధ్యక్షులు సంజీవరెడ్డి, స్టేట్ లేబర్ సెల్ చైర్మన్ ప్రకాష్ గౌడ్ లు పాల్గొన్నారు. శ్రామికుల కోసం పోరాటం చేసినందుకు తనకు గుర్తింపుగా శ్రామిక శక్తి అవార్డు అందజేసినందుకు కాంగ్రెస్ నాయకులకు, గాయత్రి షుగర్స్ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
25 సంవత్సరాల నుండి INTUC యూనియన్ తరపున కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ కార్మికులకు సేవలు అందించినందుకు గుర్తింపుగా ఈరోజు గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా శ్రామిక శక్తి అవార్డు ఇచ్చినందుకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు వి హనుమంతరావు గారికి నేషనల్ INTUC ప్రెసిడెంట్ జి సంజీవరెడ్డి స్టేట్ లేబర్ సెల్ చైర్మన్ ప్రకాష్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపిన సదాశివనగర్ మండల ఓ అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పరిధిలో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డికి శ్రామిక శక్తి అవార్డు లభించింది.






