1 May, 2026 | 4:01 PM

వ్యక్తి అదృశ్యం.. కల్హేర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

01-05-2026 02:39 PM

కల్హేర్ మే 01(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తి అదృశ్యం పై కేసు నమోదు. ఎస్ఐ రవి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఎలక రాజు (శ్రీనివాస్) మంచిర్యాల జిల్లా యాదాద్రి భువనగికి చెందిన వ్యక్తి. ఎలక రాజు శ్రీనివాస్ 43 సం" అనే వ్యక్తి ఏప్రిల్ నెల 19వ తేదీ నుంచి కనబడుట లేదు. కామారెడ్డి జిల్లా కొడప్గల్ కు చెందిన మహా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దగ్గర బోర్ బండి డ్రైవర్ గా కొనసాగుతున్న శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రం వద్ద బోర్ బండి నడుపుటకు రాగ శ్రీనివాస్ మద్యం సేవించి ఉండడంతో బోర్ బండి నడపవద్దని యజమాని శ్రీనివాస్ రెడ్డి సూచించాడు. దీంతో అతని వద్ద 500 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్తానని చెప్పి అదృశ్య మయ్యాడు. అదృశ్య మైన శ్రీనివాస్ అనే వ్యక్తి చామన చాయ రంగు కలిగి, బూడిద రంగు టీ షర్ట్ ప్యాంటు వేసుకొని ఉన్నాడు. ఆయన భార్య సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ తెలిపారు.