కాంపెల్లి సతీష్ మాదిగ కు దళిత రత్న అవార్డు
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ఎం హెచ్ డీ అధ్యక్షుడు కాంపల్లి సతీష్ కు దళిత రత్న అవార్డు వరించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురువారం కాంపల్లి సతీష్ దళిత రత్న అవార్డు అందుకున్నారు. మహనీయులు జ్యోతిరావుబాపులే,బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దళిత బహజన సంఘాల ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డులను అందేశారు. మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ మాదిగ ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ మేతరి రోజా రాణి మాదిగ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాదిగ,మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వ్యవస్థాపకులు రేగుంట సునీల్ మాదిగ చేతుల మీదగా దళిత రత్న అవార్డును అందుకున్నారు. దళిత రత్న అవార్డు రావడం పట్ల కాంపెల్లి సతీష్ మాదిగ హర్షం వెలిబుచ్చారు.






