నగరంలో పేదోళ్లకు ఇల్లు ఉండొద్దా?
- దొరలకు ఎందుకు నచ్చడం లేదు!
- పేదల జీవితాలతో రాజకీయాలు వద్దు
- రూ.60 లక్షల ఇంటిని 6 లక్షలకే ఇస్తే అభ్యంతరమెందుకు?
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం నడిబొడ్డులో పేదలకు సొంతింటిని అందించాలని చూస్తుంటే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన దొరలకు నచ్చడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని, మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
మీసేవతో పాటు వాట్సాప్ నెంబర్ (8096958096), వ్బుసైట్ (meeseva.telangana.gov.in) ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు, దరఖాస్తులు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగాలు, ఉపాధి, పిల్లల చదువులు, వైద్య సౌకర్యాలకు దూరంగా 30 నుంచి -40 కిలోమీటర్ల దూరంలో కనీస వసతులు కల్పించకుండా అరకొరగా ఇళ్లను నిర్మించి అదే పేదల సంక్షేమమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ టవర్స్‌గా మార్చి విక్రయిస్తారన్న ప్రచా రం పూర్తిగా అవాస్తవమన్నారు.






