24 July, 2026 | 4:57 AM

మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలి

24-07-2026 12:32 AM
  1. మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలి 
  2. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి అదేశం 
  3. శాసనసభ పనుల పరిశీలన

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): శాసనసభలో జరుగుతున్న మరమ్మతు పనులను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం పరిశీలిం చారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన ఈ ప్రాంగాణాన్ని మరింత మెరుగైన మౌళిక సదుపాయాలతో తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ ట్వీట్ చేశారు.

సీఎం వెంట అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్‌రెడ్డి, మండలి, అసెంబ్లీ సెక్రటరీలు నరసింహా చార్యాలు, రెండ్ల తిరుపతి, సీఎల్పీ కార్యదర్శి శ్రీకాంత్ ఉన్నారు.