27 April, 2026 | 3:21 AM

ట్రంప్ డిన్నర్‌లో కాల్పులు

27-04-2026 01:46 AM
  1. ఐదు నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దాలు
  2. సురక్షిత ప్రాంతానికి ట్రంప్, మంత్రుల తరలింపు అదుపులోకి నిందితుడు 
  3. ఆ హోటల్‌లోనే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

వాషింగ్టన్, ఏప్రిల్ 26: అమెరికా వైట్‌హౌస్ సమీపంలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పు ల ఘటన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతోపాటు ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియోను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదన్నారు. తూటాలు పేల్చిన నిందితుడు కోలో టామోస్ అలెన్‌గా దర్యాప్తు బృందాలు గుర్తించాయి.  

 వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ కోసం ఏర్పా టు చేసిన ఈ డిన్నర్‌లో ట్రంప్‌పైకి ఓ దుండగుడు తూటాలు పేల్చడం, సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రత అధికారులు బ్యాంకెట్ హాల్లోకి అతడు ప్రవేశించడంతో వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించినట్లు అక్కడున్నవారు తెలిపారు. దీంతో బ్యాంకెట్ హాల్ వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.

సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు వెల్లడించారు. వెంటనే అక్కడి నుంచి తనతో పాటు మెలానియా, జేడీవాన్స్, క్యాబినెట్ సభ్యులందరినీ తరలించినట్లు తెలిపారు. తామంతా సురక్షితం గా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే దాడి సమయంలో హిల్టన్ హోటల్‌లోనే తాను ఉన్నాని, ఈ ఘటన జరగడం భద్రతా వైఫల్యమేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలిపారు.

ఈ మేరకు ఆ హోటల్ నుంచి వీడియో విడుదల చేశారు. తాను ఎప్పుడు అమెరికాకు వెళ్లినా హిల్టన్‌లోనే బస చేస్తానని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ హోటల్‌లో జరుగుతున్న అధ్యక్షుడి కార్యక్రమంలో కాల్పులు చోటుచేసుకోవడం భద్రతా వైఫల్యమేన న్నారు. ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువ అవ్వడం వల్ల శాంతి కరువైందని తెలిపారు. అందుకే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న అన్ని యుద్ధాలు ఆగాలని ఆకాంక్షించారు. 

నిందితుడు విద్యావంతుడైనప్పటికీ..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిన్నర్ పార్టీలో కాల్పులు జరిపిన నిందితుడు టా మోస్ అలెన్ విద్యావంతుడని, మంచి మెకానికల్ ఇంజినీర్ అని భద్రతా బలగాల విచా రణలో తేలింది. యువకుడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంత వాసిగా అని తెలి సింది. అతడు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. 2017లో కాల్టెక్‌లో అతడు వీల్‌చైర్స్‌కు ఎమర్జెన్సీ బ్రేక్ అమర్చి శాస్త్రవేత్తలను ఆకట్టుకున్నాడు.

యువకుడి ఆవిష్కర ణను చూసి అక్కడి మీడియా వేనోళ్ల కొనియాడింది. తర్వాత, యువకుడు కాలిఫో ర్నియా స్టేట్ వర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిచేశాడు. తర్వాత, ఒక వీడియోగేమ్ తయారు చేశాడు. ట్రేడ్‌మార్క్ కోసమూ రిజిస్టర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు టెస్ట్ ప్రిపరేషన్ ట్యూటరింగ్ కంపెనీ సీ సంస్థలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.