టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ కరువు
- ‘మా, మాటీ, మానుష్’తో ఎంతోకాలం నమ్మించలేదు
- మొదటి విడతలో టీఎంసీ అహంకారం ముక్కలైంది
- తుది విడత ముగిసేసరికి బీజేపీకి అధికారం ఖాయం
- బీజేపీని గెలిపిస్తే మహా జంగిల్ రాజ్‌కు చరమగీతం
- కోల్‌కతా, బంగావ్‌లో భారీ రోడ్‌షోల్లో ప్రధాని మోదీ
కోల్‌కతా, ఏప్రిల్ 26: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతవరకు బెంగాల్‌లో మహిళలకు రక్షణ ఉండ దని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని, అందువల్లే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మహా జంగిల్ రాజ్ నుంచి రక్షణ కల్పిస్తామని చెప్పారు.
మహిళల రక్షణ గురించి తాము ఆలోచిస్తాం కాబట్టే ఆర్జీకర్ మృతురాలి తల్లికి తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల టికెట్ ఇచ్చామన్నారు. బెంగాల్‌లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలపై దారుణాలకు పాల్పడిన నిందితులను న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నిక ల్లో తొలి విడత పోలింగ్‌లో భారీ ఓటింగ్‌తో టీఎంసీకి గట్టి దెబ్బ తగిలిందని, తుది విడత ముగిసేసరికి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
కోల్‌కతా, బంగావ్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభ, భారీ రోడ్‌షోలలో ప్రధా ని నిర్వహించారు. బంగావ్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు. తొలి విడత పోలింగ్‌లో భారీ ఓటింగ్‌తో టీఎంసీకి గట్టి దెబ్బ తగిలిందని, తుది విడత ముగిసేసరికి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తొలి విడత పోలింగ్‌లో టీఎంసీ అహంకారం ముక్కలైందని, రెండో దశలో బీజేపీకి కీలక విజయం దక్కనుందని చెప్పారు.
బెంగాల్ రాష్ట్రంలో తరచూ బాలికలు అదృశ్య మవుతున్న కేసులు నమోదు అవుతున్నాయని, అయినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిద్రపోతోందని ఆగ్రహించారు. టీఎంసీ హయాం లో చిన్నస్థాయి నేతలు, గూండాలు సైతం అధికారం తమదే అన్నట్టు వ్యవహరించడంతో పాలన గాడితప్పిందని, జవాబుదారీ తనం లోపించిందని మోదీ విమర్శించారు. ‘మా, మాటీ, మానుష్’ నినాదంతో టీఎంసీ ఎంతోకాలం నమ్మించలేదని, ఈ మూడు విషయాల్లోనూ ప్రభుత్వం విఫలమైందన్నా రు.
తల్లులు అనేక బాధలకు గురయితే, భూ ములు దుర్వినియోగమయ్యాయని, ప్రజలు గత్యంతరం లేక వలసబాటలు పట్టారని విమర్శించారు. మహిళలతో పాటు రైతులు, కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం లో బీజేపీ కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమానికి బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రైతులు, కూలీల ఆందోళనలను తాము ఆర్థం చేసుకున్నామని చెప్పారు. ఆ కారణంగా గత 11 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం జన పనారకు కనీస మద్దతుధరను రెట్టింపు చేసిందని, గోధుమలు, బియ్యం ప్యాకింగ్ 100 శాతం జనపనారతో ఉండటం తప్పనిసరి చేశామని అన్నారు.
అయితే జనపనార మిల్లులను టీఎంసీ సిండికేట్ అనుమతించడం లేదని, ఇక్కడి రైతుల సంక్షేమ కోసం టీఎంసీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘మార్పు తప్పనిసరి’ అనేది మాత్రమే బెంగాల్ ఏకైక నినాదం కావాలని మోదీ పిలుపునిచ్చారు. హుగ్లీ నది పరిసరాల్లో ఒకప్పుడు మిల్లులు, ఫ్యాక్టరీలు అధికంగా ఉండేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటినీ మూసివేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే వాటిని తిరిగి తెరిపిస్తామన్నారు.
చొరబాటుదారుల నుం చి బెంగాల్‌ను విముక్తి కల్పిస్తామని, బెంగాల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. తర్వాత కోల్‌కతాలో భారీ రోడ్‌షోలో ప్రధాని పాల్గొన్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్‌షోలో పెద్దఎత్తున కార్యకర్తలు తరలొచ్చి పాల్గొన్నారు. సిమ్లా స్ట్రీట్‌లోని స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి దగ్గర నుంచి ఈ రోడ్షో మొదలైంది. స్వామి వివేకానంద విగ్రహానికి ప్రధాని పూలమాలలు వేసి రోడ్షో ప్రారంభించారు. ప్రఖ్యాత బిదాన్ సరానీ, హేదు పార్క్, బెత్యూన్ కాలేజ్ మీదుగా శ్యా మ్‌బజార్‌లోని ఖన్నా క్రాసింగ్ వరకు రోడ్ షో జరిగింది. కాగా, ఈనెల 29న మిగిలిన 142 స్థానాలకు రెండో దశ పోలింగ్ జరుగనుంది.
సిద్ధేశ్వరి మాతకు పూజలు..
కోల్‌కతాలో నిర్వహించిన భారీ రోడ్‌షోకు ముందు కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీ దేవాలయాల్లో ఒకటైన తంథానియా కాళీబారి మందిరాన్ని ప్రధాని మోదీ దర్శించుకు న్నారు. అక్కడి సిద్ధేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. 300 సంవత్సరాల పైగా చారిత్ర ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయాన్ని రామకృష్ణ పరమహంస తరచూ సందర్శించేవారని చెబుతారు. సిద్ధేశ్వరి మాతకు మాంసాహారం ప్రసాదంగా సమర్పిస్తారు.
అమ్మకు ఈ ప్రసాదాన్ని రామకృష్ణ పరమహంస మొదటగా సమర్పించారని, అప్పటి నుంచి ఇదే ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలుస్తోంది. రామకృష్ణ పర మహంస ఒకసారి శ్యాంపుకూర్‌లో బస చేసినప్పుడు అస్వస్థతకు గురయ్యారు. దీం తో ఆయన త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తూ పరమహంస శిష్యులు మాంసాహార ప్రసాదాన్ని దేవికి సమర్పించినట్టు చెబుతారు.






