‘షాప్ టు షాప్’ కస్టమర్ అవుట్ రీచ్
29-07-2026 01:07 AM
యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో కార్యక్రమం
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం ‘షాప్ టు షాప్’ కస్టమర్ అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రాంతీయ అధిపతి డి. అపర్ణా రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, క్లరికల్ సిబ్బంది, సబ్ స్టాఫ్ పాల్గొన్నారు. స్థానిక దుకాణాలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి బ్యాంక్ అందిస్తున్న అధిక వడ్డీ డిపాజిట్ పథకాలు, ఎంఎస్‌ఎంఈ రుణాలు, రిటైల్ లోన్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, ఆధునిక మొబైల్ బ్యాంకింగ్ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు.






