4 August, 2026 | 3:36 AM

లవ్ లెటర్లు, లివ్-ఇన్ ఆఫర్లు!

04-08-2026 01:34 AM

ట్రైన్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో విస్తుపోయే కోణాలు

రంగారెడ్డి, ఆగస్టు 3 (విజయక్రాంతి): ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. అశోక్ నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి రూంలో సోమవారం పోలీసులు తనిఖీలు చేశారు. గదిలో రెండు ప్రేమలేఖలు, ఒక కత్తి, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు.

ఉదయ్ కృష్ణారెడ్డి ఏపీకి చెందిన వివాహితతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సదరు వివాహితను బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ నేరుగా కలిశారు. ఉదయ్ కృష్ణారెడ్డికి ఉన్న సైకో మనస్తత్వం, విపరీతమైన ప్రవర్తన, తనపై జరిపిన భౌతిక దాడుల గురించి మహిళా ట్రైనీ ఐపీఎస్ వివరిండంతో.. ఉదయ్ అసలు రంగు తెలుసుకున్న ఆ వివాహిత అతడిని పూర్తిగా దూరం పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మరొక యువతికి కూడా ఉదయ్ పెళ్లి ప్రతిపాదనలు పంపినట్లు విచారణలో తేలింది.