భక్తులతో నిండిన శివాలయాలు
13-07-2026 04:06 PM
సుల్తానాబాద్, జులై 13 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం కలసి రావడంతో శివాలయాల్లో దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి విశేషంగా పలు రకాల పండ్లతో, రుద్రాభిషేకం జరిపించి బిల్వదళాలతో, కమలలాల అర్చించడం జరిగినది,అలాగే అన్న పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, అర్చకులు వల్ల కొండ రమేష్, పొలాస అశోక్, పారువెల్ల రమేష్ శర్మ , తొడుపునూరి రాజేంద్రప్రసాద్ తో పాటు పెద్దఎత్తున భక్త బృందం, మహిళలు పాల్గొని బిల్వదలాలు సమర్పించి తీర్థ ప్రసాదములుస్వీకరించినారు..సుల్తానాబాద్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు.






