రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా కలిసిన శివసేనరెడ్డి
వనపర్తి, మార్చి 2 ( విజయక్రాంతి ) : ఉభయ తెలుగు రాష్ట్రాలలో డిసిసి అధ్యక్షుల కోసం నిర్వహించిన సంఘటన సృజన్ అభియాన్ శిక్షణ శిబిరాన్ని కార్యక్రమాన్ని నిర్విరామంగా పది రోజులపాటు నిర్వహించారు. డిసిసి అధ్యక్షులకు,పార్టీ నాయకుల దిశ నిర్దేశించే ముగింపు కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సోమవారం వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక ప్రాంతంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిభిరంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీనీ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
రాహుల్ గాంధీ, శివసేన రెడ్డితో రాష్ట్రంలో క్రీడా సంస్థ ఆధ్వర్యంలో చేప డుతున్న క్రీడాంశాలపై, జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం శిక్ష శిబిరంలో సంస్థాగత బలోపేతం, నాయకత్వానికి సంబంధించిన సామర్ధ్యాల, బూతు స్థాయి నుండి పార్టీని పటిష్టంగా చేసే దిశగా ఈ యొక్క శిక్షణ శిబిరం ఎంత దోహదపడుతుందన్నీ డిసిసి అధ్యక్షులకు సూచించారు.




