10 May, 2026 | 5:58 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా

10-05-2026 05:23 PM

బోథ్,(విజయక్రాంతి): పశువుల అక్రమ రవాణా పై ఆదిలాబాద్ పోలీస్ అధికారులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పశువుల అక్రమ రవాణా కు బ్రేక్ పడినట్లు అయిందని పరిశీలకులు అంటున్నారు. అయితే గతంలో జిల్లా మీదుగా హైదరాబాద్ నాగపూర్ వంటి పట్టణాలకు పశువుల అక్రమ రవాణా జరిగేది . అయితే పశువుల అక్రమ రవాణాను బజరంగ్దళ్ బిజెపి విశ్వహిందూ పరిషత్ లకు చెందిన కార్యకర్తలు పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేవారు.

అయితే దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తులు అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను పట్టుకుని డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది.అయితే విషయం గమనించిన పోలీసు అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం సరిహద్దు చెక్పోస్టుల్లో పశువుల అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రత్యేకంగా పోలీసులు అధికారుల ను నియమించారు. అందులో భాగంగానే సోనాల మండలంలోని గన్ పూర్ చెక్పోస్ట్ వద్ద పోలీసుల నిఘాను పెంచారు. పగలు ముగ్గురు రాత్రిపూట నలుగురు పోలీసులను చెక్ పోస్ట్ ల వద్ద ఉంచడం జరిగింది. దీంతో పశువుల రవాణాకు కట్టడి చేసినట్ల అయింది.

జొన్నల రవాణాపై నిఘ ఉంచాలి... మహారాష్ట్ర నుండి ఇప్పటికే వేలాది క్వింటాళ్ల జొన్నలు సరిహద్దులు దాటి వచ్చాయని పలువురు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో జొన్నల ధర రెండు వేల పై గా ఉండగా. తెలంగాణ ప్రభుత్వం 3400 కు పైగా ధర లో కొనుగోలు చేస్తున్నడంతో ఈ అక్రమ వ్యాపారాన్ని గత రెండు సంవత్సరాలుగా కొంతమంది చేపడుతున్నారు. బోత్ మండలంలోని  మర్లపల్లి మీదుగా జొన్నల రవాణా జోరుగా సాగింది మండల కేంద్రానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి గతంలో 1000 కుంటల వరకు క్రయవిక్రయాలు జరిపారని అంటున్నారు. కొంతమంది దళారీలు సైతం రైతుల పేరుతో ఈ దందాను కొనసాగించారు.ఈసారి సైతం అదే విధమైన అక్రమ వ్యాపారం జరిగే ఆస్కారం ఉందని అంటున్నారు.సివిని మరల పెళ్లి రహదారిపై చెక్ పోస్ట్ చేయాలని పలువురు కోరుతున్నారు.