11 May, 2026 | 2:43 AM

సావరియా మిఠాయి నూతన బ్రాంచ్

11-05-2026 01:34 AM

శివం రోడ్‌లో ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ 

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): ప్రముఖ స్వీట్స్, చాట్ బ్రాండ్ సావరియా మిఠాయి హైదరాబాద్‌లోని నల్లకుంట శివం రోడ్డులో నూతన బ్రాంచీని ఘనంగా ప్రారంభించింది. ఈ నూతన ఔట్‌లెట్‌ను అంబర్‌పే ట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. అగర్వాల్ వ్యాపారవేత్త దీపక్ గోయల్ స్థాపించిన సావరియా మిఠాయి, 2025 డిసెంబర్ 22న సికింద్రాబాద్ సింధీ కాలనీలో తమ తొలి బ్రాంచీని ప్రారంభించింది.

తక్కువ సమయంలోనే స్వీట్స్, చాక్లెట్స్, వివిధ రకాల వంటకాలు, చాట్స్, పానీపూరి, చోలా భటూరే, పావ్ భాజీ, పిజ్జాలు, పరాఠాలు వంటి ఫుడ్ ఐటమ్స్‌తో ఆదరణ పొందింది. ఈ సందర్భంగా దీపక్ గోయల్ మాట్లాడుతూ.. తొలి బ్రాంచ్ ప్రారంభం నుంచి తమకు లభించిన ఆదరణకు వినియోగదారులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల నుంచి వచ్చిన స్పందనే శివం రోడ్లో కుటుంబాలతో కలిసి కూర్చొని ఆహారం ఆస్వాదించేందుకు అనువైన సౌకర్యాలతో కొత్త బ్రాంచీని ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే కాలేరు ఆహార పదార్థాల నాణ్యత, రుచి, విభిన్నతను ప్రశంసించారు.