11 May, 2026 | 2:44 AM

ప్రధాని సభకు తరలివెళ్లిన గాంధీనగర్ బీజేపీ శ్రేణులు

11-05-2026 01:32 AM

ముషీరాబాద్, మే 10 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ బహిరంగ సభ కు ఆదివారం గాంధీనగర్ డివిజన్ నుంచి ప్రజలు మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. జనసమీకరణకు ఏర్పాటు చేసిన బస్సులను గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావనివినయ్ కుమా ర్ జెండా ఊపి ప్రారంభించారు.

సుమారు 600 మందితో బయలుదేరి డివిజన్ బీజేపీ శ్రేణులు బహిరంగ సభలో పాల్గొంటున్నారని మాజీ కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్‌కుమార్, సీనియర్ నాయకులు టి.గోపాల్, రత్నసాయిచంద్, శ్రీకాంత్, దామోదర్, సత్తి రెడ్డి, వాణిశాస్త్రి, ప్రకాష్ యాదవ్, శివకుమార్, శ్రీనివాస్, నర్సింహ, హన్మంతు, యాదగిరి, రాజేందర్, నీరజ్, సంయుక్త రాణి, లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.