మహిళల హక్కులపై షీ టీం అవగాహన
మహబూబాబాద్, మే 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై షీటీమ్ ఆధ్వర్యంలో ఎస్ఐ సునంద అవగాహన కల్పించారు. నిర్వహించారు. షీటీమ్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మహిళలకు, బాలికలకు షీటీమ్ ద్వారా ఎలాంటి రక్షణ, సహాయం అందుతుందనే విషయాలను ప్రజలకు తెలియజేశారు.
బాలలపై జరుగుతున్న లైంగిక దాడులు, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం ప్రాముఖ్యత, బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన చైల్ హెల్ప్లైన్ నంబర్ 1098, మహిళా హెల్ప్లైన్ 1091, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930, డయల్-100 సేవల గురించి వివరించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు, సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే షీటీమ్ వాట్సాప్ నంబర్ 8712656935 కు సమాచారం అందించాలని కోరారు.






