జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జిల్లా అటవీ అధికారి
08-05-2026 12:34 AM
కామారెడ్డి, మే 7 (విజయ క్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహించి బదిలీపై కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారిగా నియమితులైన నీరజ్ కుమార్ టిబ్రీవల్, గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో అటవీ సంరక్షణ, వనమహోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.






