calender_icon.png 12 February, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకరి మల్లేశం కృషి ఎనలేనిది

12-02-2026 01:13:44 AM

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ  హైదరాబాద్ రాంనగర్ లోని ఆయ న నివాసంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిసినట్లు సుంకరి మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ  మల్లేశంకు పూల గుచ్చాన్ని అందజేసి శుభాకాం క్షలు  తెలియజేశారు. అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మల్లేశం తన వృత్తి జీవితాన్ని ఐడిపిల్‌లో ప్రారంభించి, అక్కడి కార్మికుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేశారని అన్నారు. 

అనంతరం బీఎంఎస్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తూ,   తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందిస్తూ కార్మికోద్యమాన్ని బలోపేతం చేశారని,  దత్తాత్రేయ ఆయన సేవలను కొనియాడారు. తాను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మల్లేశం సామర్థ్యాన్ని గుర్తించి ఈపిఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటి) సభ్యుడిగా నియమించానని, ఆ బాధ్య తను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపారు. వారి నాయకత్వంలో బీఎం ఎస్ మరింత బలపడాలని ఆకాంక్షించారు.  విజయవంతమైన పదవీకాలం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు  బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.