మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: బొంతు వేణు
మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సత్తుపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొంతు వేణు
సత్తుపల్లి. జూలై 10,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కోట నరసమ్మ మరియు గ్యాస్ గోడం పక్కన నివసించే పత్తిపాటి అశోక్ ఇటీవల మరణించిన విషయం తెలిసి, వారి కుటుంబాలను సత్తుపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొంతు వేణు పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన బొంతు వేణు బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.






