12-02-2026 01:12:44 AM
నిర్మల్, ఫిబ్రవరి 1౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు వెడుమ బుజ్జు పటేల్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం వల్ల ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అప్పల కావ్య మాజీ చైర్మన్ గణేష్ చక్రవర్తి మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి తదితరులు ఉన్నారు.