వృధాగా ఇందిరమ్మ మోడల్ హౌస్
బోథ్, జులై 10(విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ వృధాగా ఉంది దీంతో కొంతమంది రైతులు మోడల్ హౌస్ ముందే పశుగ్రాసం విలువ చేసుకున్నారు. ఇటీవల నిర్మించిన ఇందిరమ్మ హౌస్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉండడంతో పంచాయతీరాజ్ అధికారులు వచ్చినప్పుడు వినియోగించుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పాత ఇందిరమ్మ మోడల్ హౌస్ మాత్రం నిరుపయోగంగా ఉంది ప్రభుత్వం కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు అత్యధిక పవనాలలో కార్యాలయాలు కొనసాగవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న ఐసిడిఎస్ కార్యాలయం ట్రెజరీ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి వాటిలో ఏదైనా ఒక భవనాన్ని పాత ఇందిరమ్మ ఇంటిలోకి మార్చితే ప్రభుత్వానికి అత్తేబారం తగ్గే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు ఈ దిశగా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది






