29 July, 2026 | 2:12 AM

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

29-07-2026 01:24 AM

 చాక్లెట్ ఆశ చూపి ఘాతుకం

మేడ్చల్, జూలై 28 (విజయక్రాంతి): నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మల్లికార్జున నగర్‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఈ నెల 26న సమీపంలోని అపార్ట్మెంట్లో ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి పిలిచాడు.

అనంతరం ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి జరిగిన ఘటనను ఏడుస్తూ తల్లికి చెప్పడంతో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రవి కుమార్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. టెంట్ హౌస్‌లో పనిచేసే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.