11 April, 2026 | 4:50 PM

అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి

11-04-2026 02:56 PM

యంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్ కు వినతి

దేవరకొండ,(విజయక్రాంతి): అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలని కళాశాల ప్రిన్సిపల్ కు వినతిపత్రం అందజేసినట్లు కళాశాల అతిథి అధ్యాపక సంఘం నాయకులు తెలిపారు. శనివారం దేవరకొండ ఎంకెఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్) పనిచేస్తున్న అతిధి అధ్యాపకుల సర్వీసును  విద్యా సంవత్సరం 2026-27లో కొనసాగించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కళాశాల అతిథి అధ్యాపక సంఘం అధ్యక్షులు బి.సురేష్ మాట్లాడుతూ... ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా అతిధి అధ్యాపకులకు నెలకు రూపాయలు 50 వేల వేతనంతో పాటు 12 నెలల కన్సాలిడేట్ జీతాన్ని చెల్లించి ప్రతి సంవత్సరం ఆటో రెన్యువల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అతిథి అధ్యాపక సంఘం ఉపాధ్యక్షులు & రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ శ్రీను కోశాధికారి పి.కొండల్, కార్యదర్శి ఎం.జగపతిబాబు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్. శ్రీనివాస్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.