7 July, 2026 | 3:37 PM

Breaking News

సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •  

సాంకేతికతతోనే పారదర్శక సేవలు

27-04-2026 06:59 PM

ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

దేవరకద్ర : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన  సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శారీరక వైకల్యం కలిగిన వారు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో, ప్రభుత్వం మంజూరు చేసిన త్రీ వీలర్ స్కూటర్లు, ట్రై సైకిళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమకు అసలైన సంతృప్తి" అని అన్నారు.

అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా దేవరకద్ర, సీసీకుంట, కౌకుంట్ల మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆధునిక 5G స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చని, సాంకేతికత వల్ల పౌష్టికాహార పంపిణీలో అవినీతికి తావుండదని, క్షేత్రస్థాయి డేటా వేగంగా ప్రభుత్వానికి చేరుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేసి, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.