31 August, 2026 | 2:41 AM

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం..

31-08-2026 01:55 AM

బైకర్ మృతి

శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (విజయక్రాంతి):గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని ఆర్బర్ స్కూల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంతో వెనుక నుంచి బ్పై వస్తున్న యువకుడు టిప్పర్ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 30న తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో జహీర్ హుస్సేన్ అనే ప్రత్యక్ష సాక్షి డయల్ 100కు సమాచారం అందించారు.

పది టైర్ల టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఎలాంటి సూచన ఇవ్వకుండా ఒక్కసారిగా కుడివైపు యూటర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి బ్పై వస్తున్న హన్మకొండ, వరంగల్కు చెందిన వేముల రవిచంద్ర (25) టిప్పర్ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.