31 August, 2026 | 4:10 AM

సీసీ రోడ్డు సమస్య పరిష్కారానికి హామీ

31-08-2026 01:53 AM

నాగోల్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): కా ంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జి మ ధు యాష్కీ గౌడ్ ఆదేశాల మేరకు జీఎస్‌ఐ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిరెడ్డి కృపాకర్రెడ్డి బండ్లగూడ చెరువును సందర్శించి. చెరువు సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ పునరుద్ధరణపై అధికారులతో చర్చించారు.

అ నంతరం రాఘవేంద్రనగర్ రోడ్ నంబర్ 5 లో సీసీ రోడ్డు సమస్యను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కా లనీ అధ్యక్షుడు కె. పూర్ణచంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు బుచ్చయ్య, సీనియర్ సభ్యుడు ఆర్. వెంకట రామిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు శివకుమార్, సుబ్బారావు, కృష్ణారెడ్డి, మహేష్గౌడ్, సతీష్, వెంకటరమణ, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.