30 June, 2026 | 11:57 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

యాదగిరిగుట్టలో కాంగ్రెస్ సీనియర్ నేత

29-04-2026 02:05 AM

స్వామివారికి కే.మురళీధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాం తి): డాక్టర్ సి.నారాయణరెడ్డి అవార్డు గ్రహీత, డాక్టర్ బోయ భీమన్న అవార్డు గ్రహీత , కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే మురళీధర్ రెడ్డి మంగళవారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వ చనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి    రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండా లని ఆకాంక్షించారు. యాదగిరిగుట్ట నుంచి తిరిగి వచ్చి మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌కి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే మురళిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి శాలువాగప్పి సత్కరించారు.