జూదం, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
జూదం ఆడుతున్న ఇద్దరు అరెస్ట్
నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం
మెదక్ ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు
పాపన్నపేట,మే07: జిల్లాలో జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని మెదక్ జిల్లా ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలం పరిధిలోని అన్నారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నట్లు గురువారం ప్రకటనలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదు, సెల్‌ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టైన వారిలో దర్శనం రాజు (32), దర్శనం వినోద్‌కుమార్ (29)లు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.8,500 నగదు, రెండు సెల్‌ఫోన్లు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సమన్వయంతో నిరంతరం దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.






