7 May, 2026 | 6:50 PM

గీత కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించాలి

07-05-2026 06:01 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 11 కార్పొరేషన్లకు నామినేటెడ్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసిన నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు కూడా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర గౌడ్ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అమర వేణి నర్సా గౌడ్ పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కార్పొరేషన్లకు నిధులు లేకపోవడంతో వివిధ కార్పొరేషన్ల సంక్షేమం పేద ప్రజలకు అందడం లేదని ఆయన ఆవేద వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ లను ప్రకటించిన నేపథ్యంలో సంక్షేమానికి బడ్జెట్ విడుదల చేయాలని ఆయన కోరారు.