7 May, 2026 | 6:41 PM

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్

07-05-2026 06:13 PM

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ 

ఖమ్మం టౌన్, మే 7 (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని పలు సమస్యలపై 46 దరఖాస్తులు అందజేశారని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకొంటామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. అనంతరం

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రం గా మార్చటానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి కృషి ఎనలేనిదని కొనియాయాడారు. ఖమ్మం నగరాన్ని చిన్న తిరుమల గా మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఆలయం నిర్మించవలసినదిగా కోరిన వెంటనే దేవస్థాన కమిటీ వారు ఆమోదించినారని ఆ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  మరియు దేవస్థాన కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్.అదే విధంగా నూతనంగా సుడా చైర్మన్ గా నియమించబడిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయమునకు విచ్చేసిన సందర్భంగా శ్రేణులు బాణాసంచా కాల్చి, పూలతో స్వాగతం పలికినారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం,జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు శ్రేణులతో కలిసి పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. నా చిరకాల మిత్రుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ని సుడా చైర్మన్ గా నియమించిన సందర్భంగా పువ్వాళ్ళ కు అభినందనలు తెలిపారు, ఈ నియామకానికి సహకరించిన టి పి సి సి అద్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితర ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు,అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన మహ్మద్ ఖాదర్ అలికి అభినందనలు తెలిపారు,అదే విధంగా ఈ రోజుతో పదవీకాలం ముగుస్తున్న ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ముక్తార్ జోహారా మరియు కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ ఐదు సంవత్సరములు ప్రజల కొరకు వారు చేసిన కృషి మరువలేనిదని ముందు ముందు వారు ప్రజాక్షేత్రంలో ప్రజలకు మరింత చేరువ కావాలని తద్వారా ప్రజల మన్ననలు పొందుతూ మరెన్నో మంచి పదవులు పొందాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ కోరారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామినేని వెంకటయ్య, వనం ప్రదీప్త చక్రవర్తి(బాబు), జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు గజ్జి సూర్యనారాయణ,జిల్లా కార్యవర్గ సభ్యులు తూములూరి లక్ష్మీ నరసింహారావు, మలీదు హైమావతి, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,కిలారు అనిల్ కుమార్, దొడ్డా పుల్లయ్య,ప్రభావతిరెడ్డి,కంచర్ల వెంకటనర్సయ్య,పులిబండ్ల చిట్టిబాబు,మూడుముంతల గంగరాజు యాదవ్, బండి మాధవరావు,లక్ష్మయ్య, రంగా జనార్ధన్,దామా స్వరూప, ఇజ్జగాని శ్రీలత,బ్రహ్మారెడ్డి, పాటి నర్సయ్య,ప్రతిభారెడ్డి, లక్ష్మీ,భవాని తదితర నాయకులు పాల్గొన్నారు.