28 February, 2026 | 8:01 PM

నూతన సఫారి వాహనాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

28-02-2026 03:03 PM

మంథని,(విజయక్రాంతి): మంథని బోయిని పేట్ 6వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి నూతన సఫారి వాహనాన్ని కరీంనగర్ షోరూం లో కొనుగోలు చేయగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం క్రాంతి దంపతులను  మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదాలు అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన శ్రీలతక్రాంతిని శాలువాతో సత్కరించి బోయిని పేట్ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ప్రభుత్వం తరుపున సహాయసహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రజలకు క్రాంతి దంపతులు చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.