30 April, 2026 | 3:23 AM

కాంగ్రెస్ బ్లాక్, మండల అధ్యక్షుల ఎంపిక

30-04-2026 12:50 AM

డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 29(విజయక్రాంతి): ఏఐసిసి  సూచనల మేరకు ఏఐసిసి ఇంచార్జ్  మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల ఆదేశాల మేరకు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్లాక్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, మండల అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి స్థానం లో కొత్త వారిని నియమించడానికి ప్రతిపాదనలను డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డికి పంపించారు.

అందులో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్ గా జార్జ్ మాథ్యూస్, సదాశివపేట బ్లాక్ ప్రెసిడెంట్ గా చాట్ల సిద్దన్న, సంగారెడ్డి టౌన్ అధ్యక్షునిగా ఆర్. కిరణ్ గౌడ్, సంగారెడ్డి మండల అధ్యక్షునిగా ఎం.డి ఖలీల్, కంది మండల అధ్యక్షునిగా బి.మొగులయ్య, కొండాపూర్ మండల ప్రెసిడెంట్ గా పి.మల్లారెడ్డి, సదాశివపేట టౌన్ అధ్యక్షునిగా పి.నాగరాజు గౌడ్, సదాశివపేట మండల ప్రెసిడెంట్ గా ఒగ్గు శ్రీనివాస్ లను ఎంపిక చేసేందుకు ప్రతిపాదించినట్లు నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.