27 June, 2026 | 3:14 PM

జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం

27-06-2026 01:58 PM

తర్వాత వస్తాం.. డబ్బులు రెడీగా ఉంచూ బెదిరింపులు

హైదరాబాద్: బంజారాహిల్స్( Banjara Hillsరోడ్ నం.10లోని శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌లో రౌడీలు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు మేనేజర్ ను బెదిరించారు. కత్తితో బెదిరించి లక్షల రూపాయులు డిమాండ్ చేశారని మేనేజర్ ఫిర్యాదు చేశారు. తర్వాత వస్తాం.. డబ్బులు రెడీగా ఉంచాలంటూ మేనేజర్ ను దుండగులు బెదిరించారు. బంగారం షాపు మేనేజర్ ను బెదిరించిన వారిని అలీమ్, యూనస్ గా గుర్తించారు. షోరూమ్ మేనేజర్ పంకజ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలీమ్, యూనస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.