ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కొత్తపల్లి, జూలై 12(విజయక్రాంతి):కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇ సుక రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకొని ట్రాక్టర్, ట్రైలర్ను స్వాధీనం చే సుకున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ ఎ. నిరంజన్ రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో పోలీసుల పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ట్రాక్టర్ మరియు ఎలాంటి చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రాలు లేకుండా మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుకను త రలిస్తున్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్ కన్నం ప్రశాంత్ (25), గోల్లపల్లి గ్రామం, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా మరియు ట్రాక్టర్ యజమాని కుర్ర రాజేశం (50), కిసాన్నగర్, కరీంనగర్ను అదుపులోకి తీసుకొని, ట్రాక్టర్, ట్రైలర్తో పాటు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.






