పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా సెగ్గం నియామకం
21-03-2026 01:11 AM
మంథని, మార్చి20(విజయక్రాంతి) పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మంథని మండల కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సెగ్గం రాజేష్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నియమించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ తాను నియమానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు కు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతుగా నిరంతరం కృషి చేస్తానని రాజేష్ తెలిపారు.




