30 June, 2026 | 5:14 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

30-06-2026 04:36 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  కోవ లక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ... పేద ప్రజలు అనారోగ్యం బారిన పడి వైద్య ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం నిలుస్తుందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసిన నిరుపేద కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు వేలాది మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 15 రోజులలోపు దరఖాస్తు చేసుకుంటే త్వరగా మంజూరయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరి వెంకన్న, బాలకృష్ణ, సలాం, జబోరే రవీందర్, లక్ష్మణ్,  నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.