30 June, 2026 | 4:45 PM

జులై 5న అరుణాచలానికి బస్సు

30-06-2026 03:48 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నుండి అరుణాచలం రామేశ్వరానికి ప్రత్యేక బస్సు జూలై 5న నడుపుతున్నట్టు నిర్మల్ డిపో మేనేజర్ పండరీ తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రాలయినా అరుణాచలం రామేశ్వరానికి జులై 5 రోజు మధ్యాన్నం 1 గం!! బయలుదేరుతుంది అన్నారు.6 వ తేదీ ఉదయం కానిపాకం, అరుణాచలం వెళ్లి ఆ రోజు అరుణాచలంలో ఉంటుంది. తర్వాతి రోజు శ్రీరంగం, పలని, పాథాలషెంబు వెళ్లి మధురై లో రాత్రి చేరుకుంటుందన్నారు. 

రామేశ్వరంలో ఒక రోజు ఉండి సముద్ర స్నానం, 22 బావుల స్నానం ధనుష్ కోడి చూసుకొని కంచి కామాక్షి బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం చేసుకొని శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని ఏడు రోజులకు నిర్మల్ తిరిగి వస్తుంది. ఛార్జి ఒకరికి  పోను రాను 8000/- రూ!! లు ఉంటుంది. ఆసక్తి కలవారు నిర్మల్ బస్టాండ్ లో గాని మీ ఫోన్ ద్వారా గాని టికెట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు 9959226003, 7382842582 లో సంప్రదించండి.