30 June, 2026 | 5:19 PM

బోసిపోయిన కోదాడ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు

30-06-2026 04:41 PM

కోదాడ,(విజయక్రాంతి): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సర్వర్ సమస్య కారణంగా మంగళవారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. స్లాట్ బుకింగ్ కాకపోవడంతో ప్రజలు వెనుదిరిగివెళ్తున్నారు, కోదాడ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం బోసిపోయి కనిపిస్తుంది. ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. స్లాట్ బుకింగ్ కాకపోవడంతో దస్తావేజు లేఖరులు ఆరాటపడుతున్నారు. తమ కస్టమర్లు వేరే దస్తావేజు లేఖర్ల వద్దకు వెళ్లకుండా నానా తిప్పలు పడుతున్నారు.