21 March, 2026 | 9:49 AM

డాగ్ స్క్వాడ్ బృందంతో ఆకస్మికంగా తనిఖీలు

21-03-2026 01:11 AM

ములుగు, గోవిందరావుపేట, మార్చి20 (విజయక్రాంతి): ములుగు జిల్లా గోవింద్రావుపేట మండలంలోని పస్రా పోలీసుస్టేషన్ పరిధిలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ బృందంతో కలిసి ములుగు ఎస్పీ ఆదేశాలతో ఆకస్మికంగా విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు అనంతరం కిరాణాలు,మెడికల్ షాపులు, ఇతర దుకాణాల్లో ప్రత్యేకంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్త్స్ర తాజుద్దీన్ మాట్లాడుతూ అక్రమ మత్తు పదార్థాల విక్రయం,నిల్వలను అరికట్టడం మరియు ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం నార్కోటిక్స్ డాగ్ సహాయంతో ప్రతి దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా అనుమానాస్పద పదార్థాలు,చట్ట విరుద్ధ కార్యకలాపాలు ఉన్నాయా అనే దానిపై దృష్టి సారించారు. ఎలాంటి అక్రమ పదార్థాలు దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు చట్టాలను పాటిస్తూ సహకరించాలని, అనుమానాస్పద విషయాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.